గత ఏడాది సీతారామం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ కి అవకాశాల మీద అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయని అందరూ భావించారు. అబ్బో సీత అందం, సీత ఒద్దిక, మృణాల్ సీత కేరెక్టర్ కి అదుర్స్ అన్నారు. సీతారామం తర్వాత మృణాల్ కామ్ గా కనిపించింది. ఎలాంటి సందడి లేదు. అవకాశాల మోత కూడా వినిపించలేదు. ఏదో స్వప్న మూవీస్ లోనే మరో సినిమా అన్నారు కానీ ఆచూకీ లేదు. బాలీవుడ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న మృణాల్ తాజాగా సైలెంట్ గా నాని హీరోగా రాబోతున్న Nani30 లో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. అంత పెద్ద హిట్ ఇచ్చిన సీత ఇంత సైలెంట్ గా అవకాశాలు పట్టేస్తుంది.
కానీ పెళ్లిసందడితో మొదటి సినిమాకే ప్లాప్ కొట్టిన శ్రీలీల మాత్రం ధమాకా వాయించేస్తుంది. క్రాకర్ లా దూసుకుపోతుంది. ధమాకా కి కూడా సో సో టాకే వచ్చింది. అయినప్పటికీ.. శ్రీలీల డాన్స్ అదిరిపోయింది. శ్రీలీల గ్లామర్ బావుంది, ఆమె లుక్స్ కేక అంటూ టాలీవుడ్ మొత్తం శ్రీలీల జపమే చేస్తుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్ట్ లతో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. శ్రీలీల హీరోయిన్ గా వైష్ణవ తేజ్ కొత్త సినిమా విడుదల తేదీ ఇచ్చేసారు. ఇంకా నితిన్ తోనూ, అలాగే రామ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తుంది.
బాలకృష్ణ కి కూతురిగా శ్రీలీల అనిల్ రావిపూడి మూవీలో సెలక్ట్ అయ్యింది.. ఇలా క్రాకర్ లా జోరు చూపిస్తున్న శ్రీలీల కి మృణాల్ కి ఎంత తేడా అంటున్నారు నెటిజెన్స్. మృణాల్ కామ్ గా సైలెంట్ గా పని చక్కబెడుతుంటే.. శ్రీలీల వైలెంట్ గా దూసుకుపోతుందిగా అంటూ ఇద్దరికి పోలిక పెడుతున్నారు.