విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత స్టార్ హీరోని చేసింది గీత గోవిందం సినిమానే. అటు పరశురామ్ ని గీత గోవిందం టాప్ డైరెక్టర్ ని చెయ్యగా.. కన్నడ బ్యూటీ రశ్మికకి గీత గోవిందం హిట్ హెల్ప్ చేసింది. గీత గోవిందం హీరో-హీరోయిన్-డైరెక్టర్ కి మంచి బ్రేక్ నిచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండ-రష్మిక ఫ్రెండ్స్ అయ్యారు. అటు పరశురామ్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేసి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు గీత గోవిందం కాంబో రిపీట్ అంటున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి చేస్తున్నాడు. ఖుషి మూవీ షూటింగ్ సమంత వలన బ్రేకులు పడినాయి. విజయ్ దేవరకొండ కూడా తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కామ్ గా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత తనకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో సినిమా చెయ్యాలనుకుంటున్నాడట. మహేష్ సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ ఇక కొత్త సినిమా మొదలు పెట్టలేదు. నాగ చైతన్యతో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ చడీ చప్పుడు లేదు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ తో పరశురామ్ తదుపరి మూవీ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది అని, ఇప్పటికే విజయ్ కి స్టోరీ లైన్ చెప్పి ఓకె కూడా చేయించుకున్నాడనే టాక్ నడుస్తుంది.