Advertisementt

వీరయ్య-వీర సింహ కలిసి తొక్కేస్తారేమో?

Wed 04th Jan 2023 09:57 AM
veera simha reddy,vs waltair veeraiah,varasudu  వీరయ్య-వీర సింహ కలిసి తొక్కేస్తారేమో?
Veera Simha Reddy vs Waltair Veeraiah vs Varasudu వీరయ్య-వీర సింహ కలిసి తొక్కేస్తారేమో?
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి చిరు vs బాలయ్య మధ్యలో విజయ్ అన్నట్టుగా ఉంది బాక్సాఫీసు పోటీ. వీరి ముగ్గురు మధ్యలోకి అజిత్ వస్తున్నా అజిత్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో అంతగా క్రేజ్ ఉండదు. అలాగే ప్రభావము ఉండదు. అందుకే ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ సినిమాల మధ్యన బీభత్సమైన పోటీ ఉంటే.. మధ్యలో విజయ్ కూడా కాస్త హడావిడగానే కనబడుతున్నాడు. బాలయ్య వీరసింహ రెడ్డి తో జనవరి 12 న వస్తున్న అంటున్నారు. అదే రోజు విజయ్ వారిసు రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు, తర్వాత రోజు వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ ఎంట్రీ ఉంది. 

అయితే మెగాస్టార్ చిరు-బాలయ్య ఇద్దరూ ప్రమోషన్స్ లో నువ్వా - నేనా అని పోటీ పడుతున్నారు. కానీ విజయ్ వారసుడు ప్రమోషన్స్ తెలుగులో స్టార్ట్ కాలేదు. దిల్ రాజు ప్రస్తుతం తమిళ్ మీదే ఫోకస్ పెట్టాడు.

తమిళంలో విజయ్ కి విపరీతమైన మార్కెట్ ఉంది. అందుకే ఎక్కువగా కోలీవుడ్ లోనే వారిసు ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ట్రైలర్ తో తెలుగులోనూ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నాడు. అయితే వాల్తేర్ వీరయ్య-వీర సింహ రెడ్డి ప్రమోషన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువే. విజయ్ వారసుడు ప్రమోషన్స్ కి హైదరాబాద్ వస్తే మహా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటాడు, అలాగే ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తాడు అంతేకాని.. ఫుల్ ప్లెజెడ్ గా తెలుగులో వారసుడు ప్రమోషన్స్ లో పాల్గొనడు.

ఏదో వారసుడు దిల్ రాజు, ఇంకా తెలుగు నటులతో ఇంటర్వూస్ ఇప్పించడం తప్ప మిగతాదేం లేదు. మరి వీరయ్య, వీర సింహాలేమో.. సాంగ్స్ వదులుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్స్ అంటూ అభిమానులకి కిక్ మీద కిక్ ఇస్తున్నారు. ఇప్పడు వీరయ్య-వీరసింహ రెడ్డిలు కలిసి వారసుడిని తొక్కేసేలా కనిపిస్తుంది వ్యవహారం.

Veera Simha Reddy vs Waltair Veeraiah vs Varasudu:

Balakrishna vs Chiranjeevi vs Vijay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ