Advertisementt

వారసుడు ట్రైలర్ రివ్యూ

Wed 04th Jan 2023 07:43 PM
vijay,varasudu trailer  వారసుడు ట్రైలర్ రివ్యూ
Varasudu Trailer Review వారసుడు ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

విజయ్ హీరోగా తెలుగు, తమిళంలో ఒకేసారి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వారసుడు/వారిసు ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. వారసుడు నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వారసుడు ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా వారసుడు థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా అని జయసుధ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ .. ఆద్యంతం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో పండక్కి విందు భోజనం లాంటి సినిమా వారసుడు అనే నమ్మకానన్ని ఇచ్చింది.

విజయ్ ఎంట్రీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. తలైవ, రంజితమే పాటలలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అవుట్ స్టాండింగా గా వున్నాయి. విజయ్ యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్స్ ఎక్స్ టార్డినరీగా వున్నాయి. విజయ్- రష్మిక ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ,  బ్రదర్స్ గా శ్రీకాంత్, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ లో శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, షామ్ పాత్రలు ఆసక్తి కరంగా వున్నాయి. ప్రకాష్ రాజ్ పాత్ర రూపంలో విజయ్ కుటుంబానికి ఒక పెద్ద సవాల్ ఎదురౌతుంది. ఆ సవాల్ ని  ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేదిచాలా క్యూరియాసిటీగా చూపించారు.

అద్భుతమైన రైటింగ్, తన స్టైలిష్, ఫెర్పెక్ట్ టేకింగ్‌తో కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు వంశీ పైడిపల్లి. విజయ్‌ని గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేశారు. పవర్ సీట్లో వుండదు సర్.. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటుంది. మన పవర్ ఆ రకం. గ్రౌండ్ లో ఎంతమంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా.. ఆట నాయకుడిని

ప్రేమో, భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం అలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తాను లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్ లో అద్భుతంగా పేలాయి. ట్రైలర్ కు ఎస్ థమన్ ఎక్స్ టార్డినరీ నేపధ్య సంగీతం అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, డ్యాన్స్ నెంబర్స్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రతి మూడ్ ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. 

Varasudu Trailer Review:

Vijay Varasudu Trailer Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ