Advertisementt

రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డ్..

Sat 07th Jan 2023 08:18 AM
nyfcc,best director award,rrr director,ss rajamouli,newyork  రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డ్..
Rajamouli flies to receive NYFCC Awards రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డ్..
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకధీరుడు.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ వరల్డ్ రేంజ్‌కి రాజమౌళి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా ఆస్కార్ అవార్డ్ కోసం వేచి చూస్తున్న వేళ.. ఇప్పుడు రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. 

 

ఇంటర్నేషనల్ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎన్నో అవార్డులు కొల్లగొడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) అవార్డ్ దర్శకధీరుడిని వరించింది. బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ విషయాన్ని ‘బహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. అవార్డ్ అందుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ అవార్డ్‌ను రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి ప్రదర్శిస్తోన్న ఫొటో ఒకటి.. సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లోని TAO డౌన్‌టౌన్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి అండ్ టీమ్ సంప్రదాయ దుస్తులలో హాజరై.. అందరినీ ఆకర్షించారు. 

Rajamouli flies to receive NYFCC Awards:

NYFCC Best Director Award Goes to RRR Director SS Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ