పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K షూటింగ్ ఆల్మోస్ట్ దగ్గరపడింది. ఈమధ్యనే ప్రాజెక్ట్ K కోసం లారీ టైర్ ని ఎలా తయారు చేసారో అనేది ఓ వీడియో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ గా రాబోతుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా.. లెజెండరీ నటుడు అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజుకి సూపర్ మ్యాన్ ని పోలిన ప్రభాస్ చేతిని రిలీజ్ చేసారు మేకర్స్.
ఈరోజు గురువారం దీపికా పదుకొనె పుట్టిన రోజు స్పెషల్ గా దీపికా కేరెక్టర్ కి సంబందించిన పోస్టర్ ని రివీల్ చేసారు. ఆ పిక్ లో దీపికా పదుకొనె వెనుదిరిగి చీకటిలో ఉన్నట్లుగా ఉంది. ఆ పాత్ర ఎలా ఉంటుందో ఓ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఎలా ఉండబోతుందో అనేది పర్ఫెక్ట్ గా రివీల్ కాకపోయినా.. దీపికా కేరెక్టర్ పై ఆసక్తిని మాత్రం క్రియేట్ చేసారు మేకర్స్. ఇక ఈ ఏడాది ప్రధమార్ధంలోనే ప్రాజెక్ట్ K షూటింగ్ ఫినిష్ అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడెనిమిది నెలలు అవసరమవుతాయని, అందుకే ప్రాజెక్ట్ K రిలీజ్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.