ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల మ్యానియాలోనే ఉంది. ధమాకాలో శ్రీలీల లుక్స్, ఆమె డాన్స్ కి హీరోలంతా ఫిదా అవుతుంటే.. ప్రేక్షకులు అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అందం, అభినయం, డాన్స్ అన్ని ఒకే అమ్మాయిలో నిజంగా అదుర్స్ అంటూ శ్రీలీలని ఆరాధిస్తున్నారు. ధమాకా హడావిడి ముగియడంతో శ్రీలీల యంగ్ హీరో రామ్ సినిమాలో షూటింగ్ లో జాయిన్ అవుతుంది.
బ్లాక్బస్టర్ అఖండ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కహీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #BoyapatiRapo ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు.