జబర్దస్త్ లో అందం, ఆకర్షణ లేకపోయినా.. నటన పరంగాను, ఎక్స్ ప్రెషన్స్ పరంగాను, అలాగే తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న ఫైమా.. చాలా తక్కువ సమయంలోనే లేడీ కమెడియన్ గా ఫెమస్ అయ్యింది. భాస్కర్ స్కిట్ లో పాపులర్ అయిన ఫైమా.. ప్రవీణ్ తో ప్రేమలో ఉందా అనేలా వారిమధ్యన స్నేహం కూడా ఏర్పడింది. జబర్దస్త్ లో బాగా పాపులర్ అయిన ఫైమా తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటర్ అయ్యింది. అటు కామెడీ పరంగాను, ఇటు ఫిజికల్ గాను అబ్బాయిలతో పోటీ పడింది.
చివరి వారాల వరకు హౌస్ లో ఉంది. టాప్5 అనుకున్నారు కానీ.. ఆమె కామెడీ స్థానంలోకి వెటకారం ప్రవేశించడంతో ఫైమా టాప్ 5 కి వెళ్లకుండానే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక బయటికి వచ్చాక మళ్ళీ జబర్దస్త్ లోకి వెంటనే వెళ్ళడానికి కుదరదు. దానితో ఫైమా ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో హడావిడి మొదలు పెట్టింది. ఇప్పుడు కమెడియన్ ఫైమా డాన్సర్ గా మారిపోయింది. BB జోడి లో బిగ్ బాస్ RJ సూర్య తో కలిసి స్టార్ మా స్టేజ్ పై డాన్స్ లో ఇతర జోడిలతో పోటీ పడుతుంది.
సూర్య-ఫైమా కలిసి స్టేజ్ పై ఇరగదీస్తుండడం చూసిన నెటిజెన్స్.. కామెడీ మానేసిన ఫైమా డాన్సర్ గా మారిపోయింది, అందుకే కామెడీ ప్లేస్ లోకి డాన్స్ ని తీసుకువచ్చి తుక్కురేగ్గోడుతుంది అంటున్నారు.