Advertisementt

బాలయ్య హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Sun 08th Jan 2023 12:33 PM
balakrishna,helicopter,emergency landing,ongole,veera simha reddy,pre release event,  బాలయ్య హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Balakrishna Helicopter Emergency Landing at Ongole బాలయ్య హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది. ఆయన నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం.. శుక్రవారం ఒంగోలుకు హెలికాప్టర్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ నుంచి దిగిన తర్వాత బాలయ్య ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే శుక్రవారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుక ముగించుకుని శనివారం ఉదయం హైదరాబాద్ బయలుదేరగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో 20 నిమిషాల పాటు గాల్లోనే హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందని తెలుస్తుంది. పొగమంచు అధికంగా ఉండటంతో.. వెంటనే పైలెట్ అలెర్ట్ అయి హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీనిపై చిత్రయూనిట్ కూడా స్పందించింది. 

ఈ రోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్‌ రావాల్సిన నందమూరి బాలకృష్ణ గారి హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన  ఒంగోలులో ఆగడం జరిగింది. పొగమంచు కారణంగా పైలెట్ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు. మరికొద్ది సేపట్లో తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్న బాలకృష్ణ గారు. వీర సింహారెడ్డి రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా నిన్న (శుక్రవారం) హెలికాప్టర్ లో ఆయన ఒంగోలు వచ్చారు అని చిత్రబృందం తెలియజేసింది. 

కాగా, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించారు. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా విడుదలకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

Balakrishna Helicopter Emergency Landing at Ongole:

Balakrishna chopper makes emergency landing in Ongole due to glitch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ