ప్రస్తుతం టాలీవుడ్‌లో ధమాకా హీరోయిన్ శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. ధమాకా సినిమా పోయింది అన్నవాళ్ళే శ్రీలీల గురించి గొప్పగా పొగిడేశారు. ధమాకా ప్లాప్ అన్నవాళ్ళే ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చెయ్యడం పట్ల నోళ్లు తెరిచారు. రవితేజతో శ్రీలీల డాన్స్, అలాగే ఆమె ఎనర్జీ పెరఫార్మెన్స్, శ్రీలీల లుక్స్ అన్ని టాలీవుడ్ యంగ్ హీరోలని పడేశాయి. అందుకే యంగ్ హీరోలంతా శ్రీలీల జపం చేస్తున్నారు. అటు శ్రీలీలని తమ సినిమాల్లో హాడావిడిగా బుక్ చేసుకుంటున్నారు. రామ్ పోతినేనితో పాన్ ఇండియా మూవీ చేస్తున్న శ్రీలీల, నితిన్‌తో ఓ మూవీ చేస్తుంది. అలాగే వైష్ణవ తేజ్‌తో మరో సినిమా పట్టాలెక్కించేసింది. ఇంకా బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా ఉండనే ఉంది.
ఇక త్రివిక్రమ్-మహేష్ కలయికలో రాబోయే SSMB28 లో శ్రీలీలని సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారన్నారు. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. ఆమె కోసం త్రివిక్రమ్ రోల్ కూడా కాస్త నిడివి పెంచేశారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు శ్రీలీల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అంటున్నారు. SSMB28 నుండి శ్రీలీల తనకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకుంది అంటున్నారు.
కానీ కొంతమంది ప్రస్తుతం శ్రీలీల ఊపు మంచి జోరులో ఉంది. యంగ్ హీరోల సరసన నటిస్తున్న ఆమె సెకండ్ హీరోయిన్‌గా చేయలేదు. అందులోనూ త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదనే విషయం గతంలో ఆయన సినిమాలు చూస్తేనే ఆమెకి అర్థమై ఉంటుంది.. అందుకే శ్రీలీల కామ్‌గా ఈ ప్రాజెక్ట్ నుండి డేట్స్ పేరు చెప్పి తప్పుకుంది అంటున్నారు.