కన్నడ ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టికి, హీరోయిన్ రష్మికకి మధ్యన మాటల యుద్ధం, అలాగే కోల్డ్ వార్ నడుస్తుంది. రష్మిక తాను హీరోయిన్‌గా లాంఛ్ అయిన సినిమాని, డైరెక్టర్, హీరోలని, నిర్మాణ సంస్థని తక్కువ చేసి మాట్లాడడం నచ్చని రిషబ్ శెట్టి వీలున్నప్పుడల్లా రష్మికపై ఇండైరెక్ట్‌గానే విడుచుకుపడుతున్నాడు. అటు కన్నడ ఇండస్ట్రీ రష్మికని బాన్ చేస్తారనే టాక్ మొదలైంది. కానీ రష్మిక మాత్రం కాంతార చూశాను, మా మధ్యన గొడవేం లేదు అంటుంది. అయితే రష్మిక నటించిన మొదటి సినిమా ‘కిర్రీక్ పార్టీ’ ఆరేళ్ళ సెలబ్రేషన్స్‌లో.. ఆమెని రిషబ్ విమర్శించడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రష్మిక కూడా అదే సందర్భంలో వాళ్ళని లైట్ తీసుకుంది. ఇలాంటి కోల్డ్ వార్ ఇప్పుడు డైరెక్ట్ యుద్ధంగా మారిపోయింది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ను ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. హిందీలో క్రేజీ హీరోయిన్‌గా మారిన రష్మిక మిషన్ మజ్ను ఈ నెలలోనే ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మరోసారి రిషబ్ శెట్టిపై డైరెక్ట్ కామెంట్స్ చేసి.. ముగిసింది అన్న వివాదం మొదటికి తీసుకువచ్చింది. అదేమంటే.. హీరోయిన్ అయినంత మాత్రాన తాను అందరికి నచ్చాలని లేదు, ఎక్కడైనా ద్వేషం ఉంటుంది. అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుంది. నేను ఓ పబ్లిక్ సెలెబ్రిటీని.
సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి నేను, నా ప్రవర్తన నచ్చకపోవచ్చు, నేను మాట్లాడే విధానం, నా ఎక్స్‌ప్రెషన్స్, నేను చేతులతో చేసే సంజ్ఞలు నచ్చకపోవచ్చు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి కారణాలు వారికుంటాయి. కానీ కొంతమందికి నేనంటే ఇష్టం ఉంటుంది, నన్ను లైక్ చేస్తారు. అలాంటివారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను.. అంటూ రిషబ్ శెట్టి తనపై ఇండైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌కి రష్మిక డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది.