ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి దిగబోతోన్నారు. చిరంజీవిని ఎంతగానో అభిమానించే దర్శకుడు బాబీ.. ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ సినిమా ఎలా అయితో మెమురబుల్ హిట్‌గా నిలిచిందో.. ఈ సినిమా మెగాస్టార్‌కి అలా నిలిచిపోతుందని అంతా అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఇదే విషయం చెప్పి.. బాబీపై ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాకి పనిచేసిన రైటర్ కోన వెంకట్ కూడా ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియజెప్పేలా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కోన వెంకట్ రచయితగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. కామెడీ ఆయన బలం. శ్రీను వైట్ల హిట్ సినిమాలన్నింటికీ ఆయన పనిచేశారు. ఆయన వ్యక్తిగతంగా వైఎస్ఆర్‌సీపీని అభిమానించినా.. సినిమాల పరంగా మాత్రం మెగాస్టార్, పవర్ స్టార్‌లను ఆయన ఎంతగానో అభిమానిస్తారు. ఈ విషయం పలు సందర్భాలలో రివీలైంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మెగాస్టార్ మనసేంటో ఆయన చెప్పుకొచ్చారు. ఈ వేడుక అనంతరం ఆయన చేసిన ట్వీట్.. మెగా ఫ్యాన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అందుకే సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.
‘‘జీవితం సముద్రంలాంటిది..
ఈత వచ్చి లోతుల్లోకి వెళ్ళేవాడికి ముత్యాలు దొరుకుతాయి.
వల వెయ్యడం తెలిసినవాడికి చేపలు దొరుకుతాయి.
వొడ్డున నిలబడితే కాళ్ళు మాత్రమే తడుస్తాయి..
అటువంటి సముద్రపు లోతులు చూసి, సముద్రాన్ని శాసించే స్థాయికి వెళ్లినవాడే మెగాస్టార్.. మా వాల్తేరు వీరయ్య’’ అంటూ కోన వెంకట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎలివేషన్‌కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.