Advertisementt

మళ్ళీ మొదలు పెట్టిన కిర్రాక్ ఆర్పీ

Tue 10th Jan 2023 12:33 PM
kiraak rp,nellore pedda reddy chepala pulusu  మళ్ళీ మొదలు పెట్టిన కిర్రాక్ ఆర్పీ
Nellore Pedda Reddy Chepala Pulusu point re open మళ్ళీ మొదలు పెట్టిన కిర్రాక్ ఆర్పీ
Advertisement
Ads by CJ

డిసెంబర్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ కూకట్ పల్లి ఏరియాలో కర్రీ పౌయింట్ పెట్టి తెగ ఫెమస్ అయ్యాడు. కానీ ఒక నెల రోజులకే ఆ కర్రీ పాయింట్ మూసేసాడు. కానీ ఆ ఒక్క నెలలోనే కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు హైదరాబాద్ నాలుమూలలా ఫెమస్ అవడం కాదు, అసలు ఆర్పీ కర్రీ పాయింట్ దగ్గర ఉన్న జనాన్ని చూస్తే ఇంట్లో ఆడవాళ్లు చేపల పులుసు వండడం మానేసారా.. అన్న రేంజ్ లో జనాలు ఎగబడ్డారు. ఒక్కసారిగా జనాల తాకిడి ఎక్కువ అవడంతో అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

అలాగే ఆర్పీ కూడా చేపలపులుసు కోసం వచ్చే వాళ్ళకి సకాలంలో నెల్లూరు స్పెషల్ డిష్ చేపల పులుసు అందించలేక చేతులు ఎత్తేసి ఓ వారం పాటు మూతవేసాడు. మళ్ళీ కిచెన్ పెంచి, నెల్లూరు చేపల పులుసు స్పెషల్ డిష్ చేసే నెల్లూరు ఆడవాళ్ళని తీసుకువచ్చి మళ్ళీ గ్రాండ్ గా వారం తిరిగేలోగా కర్రీ పాయింట్ ని ఓపెన్ చేసాడు. నిన్న జనవరి 9న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని కేక్ కట్ చేసి గ్రాండ్ గా ఓపెన్ చేసిన ఆర్పీ నెల్లూరు నుండి తీసుకువచ్చిన ఆడవాళ్ళని తన ఇంట్లోనే పెట్టుకుని మరీ వాళ్లతో చేపల పులుసు వండిస్తున్నాడు.

మరి ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కోసం ఇప్పుడు జనాలు ఎలా ఎగబడతారో.. మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చెయ్యడానికి ఆర్పీ ఎంతమంది బౌన్సర్లుని నియమిస్తాడో అనేది మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షించాల్సిందే. 

Nellore Pedda Reddy Chepala Pulusu point re open:

Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu Re Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ