సీనియర్ నటుడు నరేష్ ఈ న్యూ ఇయర్ రోజున నటి పవిత్ర లోకేష్ ని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టుగా ఓ వీడియోని అందరితో పంచుకోగా.. ఆ వీడియోలో పవిత్ర లోకేష్ నరేష్ కి ముద్దుపెడుతూ కనిపించింది. అయితే ఆ వీడియో తర్వాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోట్లలో భరణం ఇచ్చి నరేష్ ఆమెని వదిలించుకున్నాడు, రమ్య కి విడాకులు ఇచ్చేసాకే.. పవిత్రతో నరేష్ నాలుగో పెళ్ళికి సిద్దమయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దానితో రమ్య రఘుపతి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ నరేష్ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతోంది.
తనకి నరేష్ విడాకులు ఇవ్వలేదు, కోర్టులో కేసు నడుస్తుంది, నాకు నరేష్ నుండి ఎలాంటి భరణం అందలేదు, ఒకరు 200 కోట్లు, మరొకరు 300 కోట్ల భరణం రమ్య తీసుకుంది అని ప్రచారం చేస్తున్నారు, అందులో నిజం లేదు, నేను నరేష్ ఇప్పటికీ భార్య భర్తలమే, నరేష్ ఓ చీటర్, నరేష్ మంచివాడు కాదు అంటూ రమ్య రఘుపతి మరోసారి నరేష్ ని ఎక్స్ పోజ్ చేసింది. తమకి విడాకులు మంజూరు కాలేదు, తామింకా భార్య భర్తలమే, తాను తన కుమారుడి కోసం విడాకులు తీసుకోవాలని అనుకోవడం లేదు, నరేష్ ఎలాంటి వాడైనా అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.
నరేష్ తనని వదిలించుకుని పవిత్రా లోకేష్ ని పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు, తాను విడాకులు ఇవ్వకుండా వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను, ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, నేను కోర్టులో పిటిషన్ వేసాను. నా భర్తతో తిరిగి కలిసి ఉండాలని ఆ కేసు వేసిందే నేను. నేను, నా కొడుకు నరేష్ నుండి విడిపోవాలని అనుకోవడం లేదు. అందుకోసం ఫైట్ చేస్తున్నాం. ముందు విడాకులు వస్తే.. ఆ తర్వాత నాకిచ్చే భరణం, సెటిల్ మెంట్ వ్యవహారం బయటికి వస్తుంది. అసలు నేను విడాకులే ఇవ్వనప్పుడు సెటిల్‌మెంట్ ఎలా జరుగుతుంది. నాకు కావాల్సింది న్యాయం, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పవిత్ర లోకేష్ ని ఎలా వివాహం చేసుకుంటావో చూస్తా అంటూ రమ్య రఘుపతి, నరేష్ ని ఛాలెంజ్ కూడా చేసింది.