ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వరల్డ్ సినిమాని ఫాలో అవుతున్న మూవీ లవర్స్ అందరికీ ఎస్ ఎస్ రాజమౌళి పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తన ఆర్ఆర్ చిత్రంతో ఇప్పటివరకు భారతీయ దర్శకులు ఎవరు చేరుకోలేని స్టేజ్ మీద ప్రస్తుతం ఆయన నిలబడి ఉన్నారు. రాజమౌళికి ప్రస్తుతం వచ్చిన వరల్డ్ రికగ్నిషన్ కి ఆర్ఆర్ఆర్ తో పాటు ఆయన గత చిత్రాలు బాహుబలి, ఈగ కూడా ఒక కారణమైతే, భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఏ మూలనున్న సినిమానైనా ప్రేక్షకుల చేతుల్లోకి తీసుకువచ్చేసిన ఓటీటీ విప్లవం మరొక కారణంగా చెప్పొచ్చు.
ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇద్దరూ కలిసి డాన్స్ అదరగొట్టిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ కి ఎంపిక అయితే చిత్రంలో కీలకమైన కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ ఎమిషనల్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆస్కార్ అవార్డుల ప్రమోషన్ లో భాగంగా నిన్న లాస్ ఏంజిల్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ షో కి రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఎన్ టీ ఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
తన కెరీర్లో తను ఇప్పటివరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో తనకు ఎంతో ఇష్టమైనది కొమరం భీముడో పాట అని దాన్ని చిత్రీకరించిన విధానానికి తను ఎప్పుడు గర్వపడతానని చెప్పారు రాజమౌళి. ఎన్టీఆర్ ఆ పాటలో అద్భుతంగా నటించారని, తన నటన వల్లే ఆ పాట అంత బాగా వచ్చిందని చెప్తూ తారక్ ఎంతో గొప్ప నటుడని కెమెరాని కేవలం తన కనుబొమ్మ మీదే పాన్ చేసి పెట్టినా.. కేవలం తన కనుబొమ్మతోనీ నటించగల అద్భుతమైన నటుడని ప్రశంసించారు.