మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన మొహంలో గ్లో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ ని మెగా ఫాన్స్ ఇప్పటివరకు క్యారీ చేస్తూనే ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 లో చిరు లుక్స్ వైజ్ గా బావున్నా, సైరా నరసింహ రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో చిరు మేకప్, అలాగే ఆయన లుక్స్ పై కాస్త విమర్శలు వినిపించాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్న వాల్తేర్ వీరయ్య లో మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ లుక్ ని తలపించేలా పూనకాలు లోడింగ్ అంటూ మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ పక్కన మెగాస్టార్ యంగ్ లుక్స్ లోనే కనిపిస్తున్నారు. అయితే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య లో యంగ్ లుక్ లో స్టైలిష్ గా కనిపించినా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ లో కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ హలో పిల్లా హలో హలో పిల్లా లో కనిపించినట్లుగా హ్యాండ్ సమ్ గా అయితే లేరు. ఈరోజు బుధవారం విడుదలైన హలో పిల్లా హలో హలో పిల్లా సాంగ్ చూసిన అభిమానులు మిమ్మల్ని పాతికేళ్ల కుర్రాడిలా చూస్తూ మేము పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. Poonakalu Loaded 🔥🔥 అంటూ మెగాస్టార్ డాన్స్, ఆయన లుక్స్ ని చూసి మైమరచిపోతూ ఆయనకి స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
మెగాస్టార్ హలో పిల్లా హలో హలో పిల్లా అంటూ శృతి హాసన్ తో కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ కి మెగా ఫాన్స్ కి నిజంగా పూనకలొచ్చేస్తున్నాయి. గతంలో బ్రేక్ డాన్స్ తో ప్రేక్షకులని ఉర్రుతలూగించిన మెగాస్టార్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్ లో అంత గ్లో తో ఆయన వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ అలాగే ఆయన స్టయిల్ అన్ని మరోసారి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేసాయి. అయితే ఈ సాంగ్ గనక చిరంజీవి-శ్రీదేవి అలాగే బాస్ పార్టీ సాంగ్స్ కన్నా ముందే వదిలితే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేది అనడంలో సందేహం లేదు.. అందుకే ఈ పని ముందు చెయ్యాల్సింది వీరయ్య అనేది.