అల్లు అర్జున్ ఫాన్స్ నిరాశలోకి వెళ్లిపోతున్నారు. ఏడాదిగా అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు పుష్ప ద రూల్ సెట్స్ మీదకి వెళతాడా అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. డిసెంబర్ లోనే పుష్ప ద రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలైనా ఇప్పటివరకు చడీ చప్పుడు లేదు. మొన్నేదో 18 పేజెస్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ నాలుగు రోజులపాటు పుష్ప 2 షూటింగ్ లో పాల్గొన్నాడని.. అద్భుతంగా నటించాడంటూ చెప్పారు. దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. మరోపక్క అల్లు అభిమానుల అసహనం రోజు రోజుకి పెరిగిపోతుంది.
మైత్రి మూవీ మేకర్స్ ని సోషల్ మీడియా వేదికగా అల్లు అభిమానులు తిట్టిపోస్తున్నారు. పుష్ప ద రూల్ అప్ డేట్ ఇవ్వండి అంటూ హడావిడి చేస్తున్నారు. గత నెలలోనే పుష్ప నుండి గ్లిమ్ప్స్ రాబోతున్నాయని అన్నారు. కాదు ఇప్పుడు సంక్రాంతికి పుష్ప టీజర్ ని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ విషయమై ఎలాంటి న్యూస్ కానీ, ఎలాంటి సమాచారం కానీ లేకపోయేసరికి అల్లు ఫాన్స్ కి ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. అప్ డేట్ ఇవ్వండి సామి అంటూ రిక్వెస్ట్ లు పెట్టే స్టేజ్ నుండి.. తిట్టిపోసే స్టేజ్ కి ఫాన్స్ వచ్చేసారు.
రష్మిక మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా సంక్రాంతి తర్వాత పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టుగా హింట్ ఇస్తుంది. కానీ సుక్కు, అల్లు అర్జున్ లు మాత్రం అసలు పుష్ప షూటింగ్ పై ఎలాంటి స్పందన చూపించకపోవడం కూడా ఫాన్స్ కోపానికి కారణమైంది. మరి పుష్ప నుండి ఏదో ఒక అప్ డేట్ ఇచ్చేవరకు మైత్రి వారిని వారు ఊరుకునేలా లేరు.