మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. మెగా, మాస్ కాంబోని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పుణ్యమా.. చిరంజీవిపై ఎప్పుడూ ట్రోల్ అయ్యే పలు విషయాలపై స్వయంగా మెగాస్టారే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఒక్కో విషయంపై చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చిరుపై ఇప్పటి వరకు ఉన్న ఆ కాస్త నెగిటివిటీ కూడా దూరమైంది.
ముఖ్యంగా రోజా విషయంలో.. ఆమె మాట్లాడిన మాట తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఎలా రియాక్ట్ అయ్యారో తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాధానం రోజాకే కాకుండా.. మెగా ఫ్యామిలీని విమర్శించే వారందరికీ తగిలేలా చిరు క్లాస్ ఇచ్చారు. ఇక ఎప్పడి నుంచో సుమన్‌కు సంబంధించిన ఓ విషయంలో మెగాస్టార్ పేరు విరివిగా వినిపిస్తూ ఉంటుంది. బ్లూ ఫిల్మ్ విషయంలో సుమన్ అరెస్ట్‌కి కారణం చిరంజీవి అనేలా కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ రూమర్స్‌పై సుమన్ కూడా చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఆ వార్తలు ఆగలేదు. తాజాగా చిరంజీవి కూడా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
సుమన్ విషయంలో ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక పోరంబోకు చేసిన ప్రచారమది. ఒకరి కెరియర్‌ని అడ్డుకోవడానికి నేనెవరిని. పైగా సుమన్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇద్దరం కెరీర్ మొదటి నాటి నుంచి మంచి స్నేహితులం. ఇప్పటికీ ఇద్దరం చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక జర్నలిస్ట్‌ని పోరంబోకు అన్నానని కాస్త ఘాటుగా అనిపించవచ్చు. కానీ వాడు ఏదో రాశాడు.. దానిని అందరూ వక్రీకరించారు. కొన్ని వందల సార్లు సుమన్ అలాంటిదేమీ లేదని చెప్పాడు. ఇలాంటివి నిజంగా సిగ్గుచేటు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇదే కాదు ఆయన ఏమన్నా.. కొరటాలనే అని అంతా వక్రీకరించడంపై కూడా చిరు క్లారిటీ ఇచ్చారు. ఇలా పలు విషయాలపై విమర్శలు చేసే వారికి చిరంజీవి ఇచ్చిపడేశారు.