Advertisementt

భోగి రోజున అమెరికా టు హైదరాబాద్: ఎన్టీఆర్

Sat 14th Jan 2023 12:23 PM
ntr,us holiday  భోగి రోజున అమెరికా టు హైదరాబాద్: ఎన్టీఆర్
Young Tiger NTR Back To Hyderabad భోగి రోజున అమెరికా టు హైదరాబాద్: ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

గత నెలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ వేసాడు. భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ అమెరికా వెళ్ళాడు. రీసెంట్ గా అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లొబ్ అవార్డు వేడుకకి ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, మరో హీరో రామ్ చరణ్ ఆయన వైఫ్ ఉపాసన, రాజమౌళి, కీరవాణి ఫామిలీస్ తో కలిసి ఆ వేడుకలో సందడి చేసాడు. అక్కడి మీడియా తో మట్లాడుతూ హడావిడి చేసాడు. న్యూ యార్క్ వీధుల్లో భార్య ప్రణతితో తో కలిసి చక్కర్లు కొట్టాడు.

నేలరోజులుగా అమెరికాలోనే ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తిరిగి భోగి రోజున అంటే జనవరి 14 శనివారం హైదరాబాద్ కి వచ్చేసాడు. ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఫోటొస్, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పండగ మూడు రోజులు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుని తర్వాత కొరటాల మూవీ కోసం కొత్తగా మేకోవర్ అవుతాడని, అలాగే లుక్ పై కూడా ఎన్టీఆర్ దృష్టిపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 

ఫిబ్రవరి నుండి మొదలు కాబోయే NTR30 కోసం ఎన్టీఆర్ ఈనెలలోనే పూర్తిగా సిద్దమవుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  

Young Tiger NTR Back To Hyderabad:

NTR is back from his US Holiday

Tags:   NTR, US HOLIDAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ