Advertisementt

జబర్దస్త్ ఆదికి MLA టికెట్

Sun 15th Jan 2023 11:15 AM
hyper aadhi  జబర్దస్త్ ఆదికి MLA టికెట్
MLA ticket for Jabardasth Aadi జబర్దస్త్ ఆదికి MLA టికెట్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో తనదైన పంచ్ లతో కామెడీ చేస్తూ టాప్ కమెడియన్ గా మారి ఇప్పుడు సినిమాలకు మాటలు అందించే స్థాయికి ఎదిగిన హైపర్ ఆదికి బుల్లితెర మీద భీబత్సమైన క్రేజ్ ఉంది. హైపర్ ఆది వారం వారం జబర్దస్త్ స్కిట్స్ కొట్టడమే కాదు.. బుల్లితెర ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టాడు. ఇప్పుడు హైపర్ ఆది అడుగులు రాజకీయాలవైపు మళ్ళాయి. మెగా ఫ్యామిలీకి వీర విధేయుడిగా, మెగా అభిమానిగా హైపర్ ఆది జనసేన పార్టీలోకి వెళ్లాడని సంకేతాలు అందుతున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో హైపర్ ఆది తనదైన పంచ్ లతో చెలరేగిపోయాడు. 

అయితే జనసేన పార్టీలోకి ఆది అఫీషియల్ గా వెళ్లాడని.. జనసేన పార్టీ ప్రచారానికి హైపర్ ఆది ఉత్సుకత చూపించడమే కాదు.. పవన్ కళ్యాణ్ నుండి MLA టికెట్ కూడా ఆశిస్తున్నాడంటున్నారు కొందరు. అందుకే జనసేన సభలకి హాజవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. కొంతమంది హైపర్ ఆది అడక్కపోయినా.. జనసేన తరపున పవన్ కళ్యాణ్ హైపర్ ఆదికి MLA టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, అది కూడా కమెడియన్ అలీ పోటీ చేసే చోటు నుండే ఆదికి MLA గా పోటీ చేసే అవకాశం ఇవ్వొచ్చని ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

మరి 2024 ఎన్నికల సమయానికి హైపర్ ఆది పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.

MLA ticket for Jabardasth Aadi:

Hyper Aadhi Got Janasena Mla Ticket

Tags:   HYPER AADHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ