5 కోట్లు కూడా ఓపెనింగ్స్ తేలేని హీరోలు 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, సినిమాలోని సగం బడ్జెట్ హీరోల పారితోషకాలకే పోతున్నాయి.. కనీస ఓపెనింగ్స్ కూడా తేలేనివారు డిమాండ్ చేసి రెమ్యునరేషన్ పట్టుకుపోతున్నారంటూ రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ బాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ ఇంకా హాట్ హాట్ గా బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తరుణంలోనే మరో బాలీవుడ్ బడా నిర్మాత అక్కడి హీరోలపై సెన్సేషనల్ కామెట్స్ చెయ్యడం అది కూడా పారితోషకం విషయంలో చెయ్యడం ఇప్పుడు మరింత వేడిని రాజేశాయి.
ఆ నిర్మాత ఎవరో కాదు ఆదిపురుష్ నిర్మాత టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్. కొంతమంది హీరోలు సినిమాల విషయంలో చాలా పాజిటీవ్ గా నిర్మాతలకు అనుకూలంగా ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం డిమాండ్ చేస్తారు. అడిగింది ఇవ్వకపోతే ఊరుకోరు. అడిగింది ఇవ్వాల్సిందే అని బెట్టు చేస్తారు. కుదరదని చెబితే మీతో కలిసి పని చేసేది లేదని తెగేసి చెబుతారు. మేము ఒక్కోసారి వాళ్ళ డిమాండ్ ని భరించలేక వెళ్లిపొమ్మని చెబుతాం. కొంతమంది హీరోలతో బేరాలు ఆడతాము.
ఒక్కో హీరోకి 20 నుండి 25 కోట్లు పారితోషకం ఇచ్చాక సినిమా ఆడకపోతే మాకు భారీ నష్టం కదా. మేమెందుకు భారాన్ని మొయ్యాలి. చిన్న సినిమాలైనా 20 కోట్లు అడుగుతారు, కుదరదంటే చెయ్యమని తెగేసి చెబుతారు. మేము బేరాలు ఆడి ఒప్పిస్తాము.. అంటూ భూషణ్ కుమార్ బాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా చర్చలు మొదలయ్యేలా చేసాయి.