కన్నడ హీరో రిషబ్ శెట్టి రశ్మికని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. రష్మిక తన మొదటి సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాతలు గురించి వేళ్ళతో సైగలు చెయ్యడమే కాదు, ప్రపంచం మెచ్చిన కాంతార గురించి రష్మిక మాట్లాడిన మాటలకు కన్నడీగులు కన్నెర్ర జేశారు. కన్నడ ఇండస్ట్రీ నుండి రష్మిక మందన్నని బ్యాన్ చెయ్యొచ్చనే ఊహాగానాలు కూడా నడిచాయి. మధ్యలో రష్మిక కాంతార చూసాను, రిషబ్ కి నాకు మధ్యన గొడవలేం లేవని క్లారిటీ ఇచ్చినా.. రిషబ్ శెట్టి మాత్రం కిర్రాక్ పార్టీ రిలీజ్ అయ్యి 6 ఇయర్స్ అయిన సందర్భంగా ట్వీట్ చేస్తూ హీరోయిన్ రష్మిక పేరుని అవాయిడ్ చేసాడు.
ఆ తర్వాత రష్మిక కూడా కిర్రాక్ పార్టీ ఆరేళ్లయిన సందర్భంగా.. తాను ఆరేళ్ళ క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేసింది. అక్కడ కూడా నిర్మాణ సంస్థ, రిషబ్ శెట్టి పేరుని విస్మరించింది. వీరిద్దరూ డైరెక్ట్ గా గోడవెట్టుకోరు, ఫేస్ టు ఫేస్ తేల్చుకోరు, కానీ ఇండైరెక్ట్ గా మాత్రం సెటైర్స్ వేసుకుంటారు. తాజాగా రిషబ్ శెట్టి మరోమారు రశ్మికని కెలికాడు.
మేము చాలామంది నటులని లాంచ్ చేసాము, మాకు ఎంతోమంది దర్శకనిర్మాతలు అవకాశాలు ఇచ్చారు. అలాంటి లిస్ట్ మా దగ్గర చాలానే ఉంది.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అంటూ రిషబ్ శెట్టి రశ్మికని ఇండైరెక్ట్ గా కెలికాడు.