ఈ సంక్రాంతి పండగ మొత్తం చిరు-బాలకృష్ణ సినిమాలు ఆక్యుపై చేస్తున్నాయంటూ చాలామంది దర్శకనిర్మాతలు ఈ పండగ బరిలో తమ సినిమాలను నిలిపేందుకు ఆలోచించారు. అందులోను రెండు పెద్ద హీరోల డబ్బింగ్ సినిమాలు కూడా కచ్చిఫ్ వెయ్యడంతో మిగతా వారు సైలెంట్ అయ్యారు. వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్యలతో పాటుగా తెగింపు, వారసుడు చిత్రాలు ప్రేక్షకులపై ముప్పేట దాడికి సిద్దమయిన తరుణంలో సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం అంటూ ఈ పెద్ద సినిమాల మధ్యలోకి చిన్న సినిమాని తీసికొచ్చాడు. చిన్న సినిమా ప్రమోషన్స్ బావున్నాయి. వర్కౌట్ అవుతుందుకుని ప్రభాస్ హెల్ప్ తీసుకుని సంక్రాంతికి రిలీజ్ చేసారు.
అటు వీర సింహరెడ్డి, తెగింపు, ఇటు వాల్తేర్ వీరయ్య, వారసుడు ప్రభంజనంలో కళ్యాణం కమనీయం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హెల్ప్ చేసినా కళ్యాణం కమనీయాన్ని పట్టించుకున్న వారు లేరు. అందులోను యువి క్రియయేషన్స్ అంటే ఎంతో కొంత హైప్ ఉండాలి. కానీ సినిమా విడుదలకు ముందు కానీ, సినిమా విడుదల తర్వాత కానీ సినిమాపై ఎలాంటి బజ్ కనిపించలేదు. పండగ వదులుకుని ఈ వారం అయినా సినిమాని విడుదల చేసి ఉంటే మేకర్స్ ఎంతో కొంత సేవ్ అయ్యేవారు. కానీ పండగ టార్గెట్ గా పెద్ద హీరోల మధ్యన సంతోష్ శోభన్ ఇరుక్కుపోయి గిల గిలా కొట్టుకున్నాడు.