గాడ్ ఫాదర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మూడు నెలల గ్యాప్ లో 2023 సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యగా మాస్ ఆడియన్స్ తో స్టెప్స్ వేయించారు. వీరయ్యగా మాస ఆడియన్స్ ని ఊగిపోయేలా చేసిన మెగాస్టార్ ఆ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తూనే భోళా శంకర్ సెట్స్ లోకి వెళ్లిపోయారు. వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో దర్శకుడు బాబీని ఆకాశానికెత్తేస్తూ ఇలాంటి డైరెక్టర్స్ వలన నిర్మాతలు నష్టపోరు, సకాలంలో సినిమాని ఫినిష్ చేస్తే అక్కడే దర్శకనిర్మాతలు సగం సక్సెస్ అవుతారు. వాల్తేర్ వీరయ్య తో అభిమానులకి, ప్రేక్షకులకి ఏం కావాలో దర్శకుడు బాబీ చూపించాడు అంటూ మెగాస్టార్ బాబీని పొగిడేశారు.
అయితే వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతికి అదిరిపోయే హిట్ ఇచ్చి తనని సంతోషపెట్టిన బాబీకి కి మెగాస్టార్ చిరంజీవి ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రెండు కోట్లు విలువ చేసే కారుని బాబీ కి మెగాస్టార్ అందించినట్లుగా తెలుస్తుంది. బాబీని చిరు తన ఇంటికి లంచ్ కి ఆహ్వానించిన మరీ చిరంజీవి రెండు కోట్ల రూపాయల విలువైల కారుని గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ విషయంపై అటు మెగాస్టార్ కానీ ఇటు బాబీ గాని స్పందిస్తేనే అసలు విషయం వచ్చేది.