Advertisementt

అజ్ఞాతం ముగిసింది-అరాచకం మొదలవుతుంది

Thu 19th Jan 2023 12:15 PM
pushpa the rule,visakhapatnam  అజ్ఞాతం ముగిసింది-అరాచకం మొదలవుతుంది
Allu Arjun lands in Vizag అజ్ఞాతం ముగిసింది-అరాచకం మొదలవుతుంది
Advertisement
Ads by CJ

అజ్ఞాతం ముగిసింది-అరాచకం మొదలవుతుంది ఇది ఓ అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్పిన డైలాగ్. గత ఏడాదిగా అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు పుష్ప 2 సెట్స్ మీదకి వెళతాడా అని ఆయన ఫాన్స్ చాలా ఎదురు చూసారు. 2021 డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప ద రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు అందరి చూపు పుష్ప ద రూల్ మీద పడింది. కానీ సుకుమార్-అల్లు అర్జున్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టడానికే ఏడాది సమయం తీసుకున్నారు. గత డిసెంబర్ లోనే కొద్దిమేర షూటింగ్ చేసారు. 

ఇక ఈ రోజు గురువారం అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో పాల్గొనడానికి వైజాగ్ వెళ్లడంతో అల్లు అర్జున్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. అల్లు అర్జున్ షూటింగ్ సెట్స్ లోకి వెళ్లడంతో అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టారు. అన్న వస్తున్నాడు వైజాగ్ కి ఆల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాస్ జాతరకి సిద్ధమా...!!🥁🥁💥💥🌟🌟, అజ్ఞాతం ముగిసింది, అరాచకం మొదలవుతుంది...❤️‍🔥❤️‍🔥 In few more hours DEMI GOD @alluarjun landing in vizag for #PushpaTheRule Shoot!, వైజాగ్‌లో పుష్పరాజ్ ఎంట్రీ అంటూ ట్విట్టర్ లో #Pushpa హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

రీసెంట్ గా హీరోయిన్ రష్మిక కూడా పుష్ప షూటింగ్ పై అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పుష్ప ద రూల్ షూటింగ్ జరుగుతుంది. తాను ఫిబ్రవరి నుండి షూటింగ్ లో పాల్గొనడానికి ఎగ్జైట్మెంట్ తో ఉన్నట్లుగా చెప్పింది.

Allu Arjun lands in Vizag:

Pushpa The Rule in Visakhapatnam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ