Advertisementt

హైపర్ ఆది vs సుడిగాలి సుధీర్

Thu 19th Jan 2023 02:59 PM
hyper aadi,sudigali sudheer  హైపర్ ఆది vs సుడిగాలి సుధీర్
Hyper Aadi vs Sudigali Sudheer హైపర్ ఆది vs సుడిగాలి సుధీర్
Advertisement
Ads by CJ

ఇప్పుడు జబర్దస్త్ బ్యాచ్ అంతా 2024 ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారేలా కనబడుతుంది ప్రస్తుతం వ్యవహారం. ఇప్పటికే కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అంటున్నాడు. మరోపక్క జబర్దస్త్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కి హాజరవడమే కాదు మంత్రి రోజాపై ఇంకా వైసీపీ నాయకులపై నోరు పారేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ హైపర్ ఆది జనసేన ఎంట్రీ ఖాయమైనట్టే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క మంత్రి రోజా హైపర్ ఆది పై ఇండైరెక్ట్ సెటైర్స్ స్టార్ట్ చేసింది.

అయితే ఇప్పుడు హైపర్ ఆదికి పోటీగా మంత్రి రోజా మరో జబర్దస్త్ టాప్ కమెడియన్ ని రంగంలోకి దించుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైపర్ ఆది గనక జనసేన తరపున పోటీ చేస్తే అతనికి అపోజిట్ గా జబర్దస్త్ నుండి ఈమధ్యనే బయటికి వెళ్లిన సుడిగాలి సుధీర్ ని బరిలోకి దించే ఆలోచనలో రోజా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే సుడిగాలి సుధీర్ ని వైసిపీలోకి ఆహ్వానించే పనిలో ఆమె ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ రకమైన ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు.

అంటే జబర్దస్త్ లో ఎవరి స్కిట్ లో వారు కామెడీ చేసుకుంటూ ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకునే ఆది, సుధీర్ లు నిజంగా ఎన్నికల్లో పోటీపడితే ఆ మజా మాములుగా ఉండదు. 

Hyper Aadi vs Sudigali Sudheer:

Hyper Aadi and Sudigali Sudheer in 2024 elections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ