మంత్రి రోజా కొద్దిరోజులుగా జనసేన నేత పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులు ఎవరికి ఏ సహాయం చెయ్యరు అంటూ మాట్లాడిన రోజాపై మెగా ఫ్యామిలీ లో చిరు, పవన్, నాగబాబులు సపరేట్ సపరేట్ గా స్పందించారు. మెగాస్టార్ అయితే నా నుండి సహాయం తీసుకోలేదని చెప్పారా.. అది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాను.. మంత్రి అయ్యాక మా ఇంటికి ఎందుకు వచ్చింది రోజా అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే డైమండ్ రాణి అంటూ ఆమెని సంబోధించారు. ఇక రోజా కింద కామెడీ చేసిన హైపర్ ఆది అయితే మరికాస్త రెచ్చిపోయి రోజాని టార్గెట్ చేసాడు.
దానితో రోజాకి మీడియా నుండి హైపర్ ఆది విషయంలో ప్రశ్నలు ఎదురవ్వగా.. రోజా ఘాటుగా స్పందించింది. మెగా ఫ్యామిలీకి కొమ్ము కాయకపోతే వారికి అవకాశాలు రావని భయపడుతున్నారు. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు లేకుండా చేస్తారు అనే ఈ చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్ప వారి మీద ప్రేమతో కాదు అంటూ రోజా పలు మీడియా ఛానల్స్ లో చెప్పింది. అంతేకాకుండా మెగా హీరోల సపోర్ట్ తో మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేసినపుడు ఆయన అధ్యక్షుడిగా ఎందుకు గెలవలేదు అది ఆలోచించండి, అందుకని నేను చిన్న ఆర్టిస్ట్ లని తిట్టాలనుకోవడం లేదు అని కవర్ చేసుకుంది.
అయితే రోజా వ్యాఖ్యలపై రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఓ నటుడు స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు ... అంటూ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చలకు దారితీసింది. మీడియా వాళ్ళు అయితే నటుడు బ్రహ్మాజీ మంత్రి రోజాకి అదిరిపోయే కౌంటర్ వేసాడు అంటున్నారు.