మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది రెండు సినిమాలని విడుదల చేసారు. ఆచార్య తో ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆరు నెలలోనే గాడ్ ఫాదర్ గా ప్రేక్షకులని అలరించారు. ఆచార్య డిసాస్టర్ అయినా గాడ్ ఫాదర్ హిట్ అయ్యింది. గాడ్ ఫాదర్ విడుదలైన మూడు నెలలోనే వాల్తేర్ వీరయ్య గా వీరంగం సృష్టించారు. సంక్రాంతి స్పెషల్ గా గత వారమే విడుదలైన వాల్తేర్ వీరయ్య పూనకాలు లోడింగ్ అంటూ కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది. రవితేజ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్ ఈ చిత్రంతో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ వడ్డించారు.
ఇక వాల్తేర్ వీరయ్య సక్సెస్ అయ్యి వారం తిరక్కుండానే మెగాస్టార్ మరో మూవీ భోళా శంకర్ సెట్స్ లోకి దిగిపోయారు. చిరంజీవి కొద్దిగా రెస్ట్ తీసుకోకుండా ఇంత ఇమ్మిడియట్ గా సంక్రాంతి పండుగ సెలెబ్రేషన్స్ పూర్తవ్వగానే మరో సెట్స్ లోకి వెళ్లిపోయారు. నిజంగా మెగాస్టార్ ని చూసి కుర్ర హీరోలు చాలా నేర్చుకోవాలి. ఒక సినిమా చేసామంటే ఓ ఏడాది రిలాక్స్ అవుతున్నారు యంగ్ హీరోలు. అందుకు ఉదాహరణ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ లే. ట్రిపుల్ ఆర్ వచ్చి ఏడాది గడుస్తుంది. ఎన్టీఆర్ ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు. మరోపక్క ఏడాదిపైనే అయ్యింది పుష్ప రిలీజ్ అయ్యి, అల్లు అర్జున్ కూడా అదే తీరులో కనిపిస్తున్నాడు.
ఇక మహేష్ బాబు గత ఏడాది ఘట్టమనేని ఫ్యామిలిలో జరిగిన విషాదాలతో షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. కానీ చిరంజీవి వెకేషన్స్ లేవు, సరదాగా పదిరోజులు ఫ్యామిలీతో గడిపింది లేదు.. ఇలా వరసగా ఈ ఏజ్ లోనూ షూటింగ్స్ కి బ్రేక్ లేకుండా హాజరవడం నిజంగా మెగా ఫాన్స్ కిక్ ఇస్తుంటే.. యంగ్ హీరోలకి మాత్రం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది.