మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నారు. రీమేక్స్ తో చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు కూడా వచ్చాయి. ఈమధ్యనే మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. అలాగే ఇప్పుడు భోళా శంకర్ కూడా తమిళ లో హిట్ అయిన వేదళానికి రీమేక్. ప్రస్తుతం భోళా శంకర్ సెట్స్ లో ఉన్న చిరంజీవి మరో రీమేక్ పై కన్నేశారనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. వాల్తేర్ వీరయ్య సక్సెస్ తో సంతోషంలో ఉన్న చిరు మరో రీమేక్ ని ఓకె చేయబోతున్నారని అన్నారు.
తమిళంలో హిట్ అయిన అజిత్ కుమార్ విశ్వాసం తెలుగులో అంతగా క్లిక్ అవ్వలేదు. అలాగే బుల్లితెర మీద స్టార్ మా వాళ్ళు సీరియల్ మాదిరి విశ్వాసం వస్తూనే ఉంటుంది. అదే సినిమాని చిరంజీవి రీమేక్ చేయబోతున్నారని అంటున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరు అయితే ఎలాంటి మరో రీమేక్ కి కమిట్ అవ్వలేదని చెబుతున్నారు.. దానితో చిరంజీవి మరో రీమేక్ చెయ్యడం లేదు అని తేలిపోయింది.