మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ఫాన్స్ కి, సినిమా లవర్స్ కి ట్రీట్ ల మీద ట్రీట్ లు ఇచ్చేస్తున్నారు. ఆచార్య వచ్చిన ఐదు నెలలకే గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టారు. అది వచ్చిన మూడు నెలలకే వాల్తేర్ వీరయ్యతో సూపర్ హిట్ కొట్టారు. మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించారు. ఆ సక్సెస్ ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే చిరు భోళా శంకర్ సెట్స్ లోకి వెళ్లిపోయారు. భోళా శంకర్ కూడా ఏప్రిల్ 14 అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చేసారు. అలా మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు.
ముందు ఇచ్చిన రిలీజ్ డేట్ లకే చిరు వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ డేట్ మారబోతున్నట్లుగా టాక్. అది కూడా అక్కినేని కుర్ర హీరో అఖిల్ కోసం చిరు వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. అఖిల్ పాన్ ఇండియా ఫిలిం ఏజెంట్ ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. కానీ రిలీజ్ డేట్ ఇవ్వలేదు. అయితే ఏజెంట్ కి భోళా శంకర్ కి నిర్మాత ఒక్కరే. ఆయనే అనిల్ సుంకర. అయినప్పటికీ చిరు సినిమాని వెనక్కి జరిపే సాహసం చెయ్యలేరు. కానీ ఎప్పుడో మొదలైన ఏజెంట్ వలన నిర్మాణ భారం పెరిగిపోవడం, విడుదల ఆలస్యమవుతూ రావడంతో అఖిల ఏజెంట్ ని భోళా శంకర్ కన్నా ముందే విడుదల చేసే ప్లాన్ లో అనిల్ సుంకర ఉన్నారట.
ఇప్పటికే ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్లైమాక్స్ షూట్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేశారట. సో అఖిల్ ఏజెంట్ కోసం చిరు భోళా శంకర్ మే కి షిఫ్ట్ అయినా అవ్వొచ్చనే ఊహాగానాలు నడుస్తున్నాయి.