పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీడు మాములుగా లేదు. వరస ప్రాజెక్ట్‌ల షూటింగ్స్‌తో ప్రభాస్ బిజీ బిజిగా వున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్‌ని రిలీజ్‌కి రెడీ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు సలార్ షూటింగ్‌ని క్లైమాక్స్‌కి తెచ్చే పనిలో ఉన్నాడు. సలార్ షూటింగ్ కూడా ప్రశాంత్ నీల్ చకచకా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమార్ కాంబో సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రభాస్ ఇమ్మిడియట్‌గా సలార్ క్లైమాక్స్ షూట్‌లో జాయిన్ అయ్యారట.
ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమార్ కలయికలో ఇంట్రెస్టింగ్ ఫైట్స్ సీన్స్ షూట్‌ని ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన సెట్‌లో మొదలు పెట్టేశారట. ఇప్పటికే ప్రభాస్ మాస్ లుక్ మాత్రమే కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ఆడియన్స్ ని మెప్పించింది. ప్రభాస్ ఫాన్స్ అయితే ప్రభాస్ సలార్ లుక్‌కి బాగా ఇంప్రెస్స్ అయ్యారు. ప్రభాస్‌కి మాస్ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఈ క్లైమాక్స్ షూట్‌లో శృతి హాసన్ కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. ఆమె కూడా ఫైట్ సీక్వెన్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంది అంటున్నారు.
సో సెప్టెంబర్‌లో సలార్ రాక ఖాయమైనట్టే. జూన్ 16 న ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. సెప్టెంబర్ 28 న సలార్ రిలీజ్‌తో ప్రభాస్ ఫాన్స్‌కి పూనకాలే.