రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఒక సంచలనమే.. అలాగే వివాదాస్పదమే. ఒకప్పుడు సెన్సేషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఆయన పేరు ఉండేది. ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఆయన పేరు మారింది. అయితే ఎన్ని కాంట్రీవర్సీలు వచ్చినా.. చెదరక, బెదరక.. స్ట్రాంగ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు వర్మ. త్వరలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఫేవర్‌గా రెండు సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్న వర్మ.. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పిక్ షేర్ చేశాడు.
ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన షేర్ చేసింది ఒక్కటే పిక్.. కానీ అందులో ఆకలి, చావు, ప్రేమ.. ఇవి మూడు హృద్యంగా కనిపిస్తుండటం విశేషం. టైగర్ ఆకలికి ఒక కోతి మరణం పాలైతే.. మరో కోతి.. ఆ మరణించిన తల్లికోతిని అతుక్కోని ఉన్న పిల్లకోతిని చూస్తుంటే.. కళ్లు చెమ్మగిల్లుతున్నాయంటే.. ఆ పిక్‌లో ఎంత అర్థం ఉందో తెలుసుకోవచ్చు. ఈ పిక్‌నే వర్మ షేర్ చేసి.. ఒకే సమయంలో ఆకలి, చావు, ప్రేమ.. ప్రకృతికి మించిన క్రూరమైనది ఏదీ లేదు అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వర్మ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రకృతి అంటే వర్మకు ఇంత ఇష్టమా.. అంటూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆర్జీవి చెప్పిన అర్థం బాగుందని, ఈ ట్వీట్‌తో ఆయనలోని మానవతా దృక్పథం బయటకు వస్తుందని అంటున్నారు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. సందర్భాన్ని బట్టి మారుతుంటారు. అలాగే వర్మ కూడా సందర్భాన్ని బట్టి మారుతుంటాడనేలా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
Hunger , Death and Love at the same time ..Nothing is more crueller than nature pic.twitter.com/1QkOSV1aA0
— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2023