Advertisementt

SSMB28 ఈసారి మాములుగా ఉండదు

Sat 21st Jan 2023 03:54 PM
ssmb28,mahesh babu  SSMB28 ఈసారి మాములుగా ఉండదు
Interesting news on SSMB28 SSMB28 ఈసారి మాములుగా ఉండదు
Advertisement
Ads by CJ

మహేష్-త్రివిక్రమ్ కలయిక అంటే కామెడీకి కామెడీ, పంచ్ లకి పంచ్ లు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకా యాక్షన్ అన్ని మిళితమై ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ మహేష్ బాబు మ్యానరిజం అన్ని హైలెట్ అనేలా ఉంటాయి. ఇప్పుడు కూడా మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోతున్న SSMB28 లో ఇవన్నీ ఉండబోతున్నాయట. రీసెంట్ గానే మొదలైన SSMB28 కొత్త షెడ్యూల్ ప్రస్తుతం హైరాబాద్ నడిబొడ్డున సారధి స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటుంది.

అతడు, ఖలేజా లలో మహేష్ కేరెక్టర్స్ కి మించి SSMB28 లో మహేష్ కేరెక్టర్ ఉండబోతుంది అని తెలుస్తుంది. అలా వైకుంఠపురములో సముద్రఖని విలన్ కేరెక్టర్ లా ఈ సినిమాలో విలన్ కేరెక్టర్ డిఫ్రెంట్ గా ఉండబోతున్నట్లుగా, అంతేకాకుండా జగపతి బాబు SSMB28లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. పూజ హెగ్డే-శ్రీలీల కేరెక్టర్స్ కి సరిసమానమైన రోల్స్ త్రివిక్రమ్ ఇచ్చారని సమాచారం. ఇక ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ కి మారనుంది అంటున్నారు.

మహేష్ లుక్ ఫాన్స్ కే కాదు.. మిగతా మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తుంది అని, ఇప్పటివరకు మహేష్ సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు రాబోయే ఈ సినిమా మరో ఎత్తు అనేలా ఉంటుంది అంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

Interesting news on SSMB28:

SSMB28 new update

Tags:   SSMB28, MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ