‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్‌గా రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న బాలయ్య షో.. ఇప్పుడు ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. ప్రభాస్ ఎపిసోడ్‌తో సర్వర్లు క్రాష్ అయిన ఈ ఓటీటీకి.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎలా షాకివ్వబోతున్నాడనేది.. రీసెంట్‌గా వచ్చిన టీజర్‌తోనే తెలిసిపోయింది. పెద్ద సినిమాల టీజర్స్ విడుదలైనప్పుడు ఎలా అయితే రికార్డ్స్ క్రియేట్ అవుతాయో.. అదే రేంజ్‌లో ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రేంజ్‌లో ఈ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
ఈ టీజర్‌లో పవన్ కల్యాణ్‌ని బాలయ్య అడిగిన ప్రశ్నలు, అందుకు కల్యాణ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ షోకి సంబంధించి మరో పిక్ బయటికి వచ్చింది. ఆ పిక్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. మామయ్య పవన్ కల్యాణ్ అంటే సాయి తేజ్‌కి ఎంత ఇష్టమో.. ఇప్పటికే పలు సందర్భాలలో ఆయన వివరించాడు. ఇప్పుడీ షోలో సాయి ధరమ్ తేజ్ ఏం చెప్పబోతున్నాడనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
మొత్తంగా అయితే.. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఒకవైపు.. బాలయ్య మరో వైపు.. ప్రేక్షకుల వినోదానికి ఇంకేం కావాలి. ఇలా టీజర్, పిక్స్‌తోనే పీక్స్‌లోకి అంచనాలను పెంచేస్తోన్న ఈ ఎపిసోడ్‌ని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగా, నందమూరి అభిమానులే కాకుండా.. సామాన్య ప్రేక్షకులు సైతం ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నామని.. సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.