రష్మిక మందన్నా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న టైమ్‌లోనే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’లో రష్మికకి దర్శకుడు అనిల్ రావిపూడి ఆఫర్ ఇచ్చాడు. అక్కడ పాత్ర ఎలా ఉన్నా మహేష్ హీరో అనే ఒకే ఒక్క కారణంతో రష్మిక ఆ సినిమా చేసింది. కానీ ఆ సినిమాలో రష్మిక పాత్ర చూసి ప్రేక్షకులు వెగటుగా ఫీలయ్యారు. మాట్లాడితే మహేష్ మీద పడిపోతూ రష్మిక చిరాకు పెట్టించింది. ఆ తర్వాత ఆ పాత్రపై చాలా ట్రోల్స్ నడవడంతో రష్మిక హర్ట్ అయ్యి ఇంకోసారి ఇలాంటి పాత్రలు చెయ్యనే చెయ్యను, అస్సలు ఒప్పుకోను అని చెప్పింది.
కానీ రష్మిక మందన్నా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో మరోసారి అలాంటి పాత్ర అంటే అసలు ప్రాధాన్యత లేని పాత్ర చేసి మరోసారి ట్రోల్ అయ్యింది. విజయ్ నా కలల హీరో. నాకు ఆయన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం, ఈ సినిమా చేస్తున్నంతసేపు ఎంతో ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చిన రష్మికకి ఆ సినిమాలో చేసిన పాత్ర షాకిచ్చింది. జస్ట్ హీరో పక్కన పాటల కోసమే రష్మికని ఎంచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. రష్మిక పాత్రపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వారసుడు సినిమాలోని తన పాత్రపై వస్తున్న నెగిటివిటీపై రష్మిక స్పందించింది.
అవును నేను వారసుడులో ప్రాధాన్యత లేని పాత్ర చేశాను, అది నా సొంత నిర్ణయం. నా పాత్రకి స్కోప్ లేదని తెలిసినా నటించాను, విజయ్ అంటే నాకిష్టం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే అలా చేశాను. జస్ట్ రెండు పాటల కోసమే అని నాకు తెలుసు. సినిమా షూటింగ్ సమయంలో నేను సరదాగా విజయ్‌తో అనేదాన్ని. ఈ సినిమాలో నాకు పాటలు తప్ప ఒక్క సీన్ కూడా లేదు.. అంటూ జోక్స్ వేసేదాన్ని, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది.