UAEకి చెందిన క్రిటిక్‌నని, అక్కడి సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని అని చెప్పుకుని.. సినిమాలు ఇంకా థియేటర్లలోకి రాకముందే రివ్యూలు ఇచ్చేస్తూ.. నానా హంగామా చేసే ఉమైర్ సంధు అడ్డంగా దొరికేశాడు. తనకంత సీన్ లేదని మరోసారి ట్విట్టర్ వేదికగా బుక్కయ్యాడు. స్టార్ హీరోల సినిమా ఏది విడుదల అవుతున్నా సరే.. తనకి ఇష్టం వచ్చినట్లు రివ్యూ అంటూ ఏదేదో రాసేసి రేటింగ్స్ ఇచ్చే ఉమైర్ సంధు.. అది అతను కావాలని చేస్తున్న పైత్యంగా ‘పఠాన్’ సినిమా సాక్షిగా బయటపడింది.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో 5 రోజుల ముందే.. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ అన్ని పాజిటివ్స్ చెబుతూ.. 5కి 5 రేటింగ్ ఇచ్చేశాడీ క్రిటికోద్ధరుడు. అయితే ఇక్కడే అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి అతను ఇచ్చిన రివ్యూ.. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ గతంలో ‘ఏక్ థా టైగర్’ చిత్రానికి ఇచ్చిన రివ్యూని కాపీ, పేస్ట్ చేసినట్లుగా స్వయంగా తరుణ్ ఆదర్శే ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు.
స్టాప్ దిస్ నాన్సెన్స్.. నేను 2012లో ఏక్ థా టైగర్‌కి ఇచ్చిన రివ్యూని ‘పఠాన్’ రివ్యూగా నువ్వు కాపీ పేస్ట్ చేశావ్.. అంటూ గతంలో ఆయన ‘ఏక్ థా టైగర్’కి ఇచ్చిన రివ్యూని స్ర్కీన్ షాట్ పెట్టాడు. అంతే.. దెబ్బకి ఉమైర్ సంధు దిమ్మతిరిగి బొమ్మకనబడింది. వెంటనే తన రివ్యూని ఉమైర్ డిలీట్ చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో అతనిచ్చే రివ్యూలలో అర్థం పర్థం లేదని, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనేది మరోసారి తరుణ్ ఆదర్శ్ సాక్షిగా తెలిసిపోయింది.
STOP THIS NONSENSE… You have copy pasted my review of #EkThaTiger [2012] as it is and used it for your ‘review’ of #Pathaan… Here’s the link to my #EkThaTiger review: https://t.co/PEurR2k3BQ@Bollyhungama, please look into it. https://t.co/WLKVEIRH2l
— taran adarsh (@taran_adarsh) January 21, 2023