Advertisementt

నాటునాటుపై టాప్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

Mon 23rd Jan 2023 12:11 AM
farah khan,naatu naatu,choreography,rrr movie,oscars,ram charan,jr ntr  నాటునాటుపై టాప్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
Farah Khan Praises on RRR Movie Naatu Naatu Song నాటునాటుపై టాప్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
Advertisement
Ads by CJ

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తప్పకుండా ఆస్కార్‌కి నామినేట్ కావాలని అన్నారు.. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్. కొరియోగ్రఫీలో ఏదైనా బహుమతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకి ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేసిందో.. ఎటువంటి అవార్డులను రాబడుతుందో కళ్లారా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. చెవులారా వింటూనే ఉన్నారు. ‘ఆస్కార్’ అవార్డ్‌కు అడుగు దూరంలో ఉందీ చిత్రం. ఈ సందర్భంగా ప్రముఖులందరూ ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుతున్నారు.

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కొరియోగ్రఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. కొరియోగ్రఫీలో ఏదైనా బహుమతి ఉంటే ‘RRR’ చిత్రానికి తప్పకుండా ఇవ్వాలి. ఇవాళ ఆ విధంగా డ్యాన్స్ చేసే వాళ్లు ఎవరున్నారు? నిజంగా ఆ డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుంది. లాస్ ఏంజెలెస్‌లోని నా స్నేహితులెందరో ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయారు.. మైమరచిపోయామని చెప్పారు.. అద్భుతంగా ఉందని పొగిడారు. 

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు నామినేట్ కావాలి. అసలు బాహుబలికే ఈ పురస్కారం రావాలి. భారతీయ సినిమాలకు విదేశాల నుంచి ప్రశంసలు లభించాల్సిన అవసరం లేదు. మన చిత్రాలను పొగడటానికి చాలా మంది ఇండియాలోనే ఉన్నారని ఫరాఖాన్ చెప్పుకొచ్చింది. కాగా.. ‘నాటు నాటు’ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకుని.. ఆస్కార్ కోసం వేచి చూస్తోంది.

Farah Khan Praises on RRR Movie Naatu Naatu Song:

Farah Khan was all praise for RRR and especially Naatu Naatu Song Choreography

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ