Advertisementt

రష్మిక మందన్నా.. ఆ మిషన్ ఆపేస్తే బెటర్!

Mon 23rd Jan 2023 11:04 AM
rashmika mandanna,heroine,mission majnu,vaarasudu,tollywood,kannada heroine,rashmika  రష్మిక మందన్నా.. ఆ మిషన్ ఆపేస్తే బెటర్!
Rashmika Mandanna Mission Failed in Bollywood రష్మిక మందన్నా.. ఆ మిషన్ ఆపేస్తే బెటర్!
Advertisement
Ads by CJ

ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అనేది హీరోయిన్ల విషయంలో బాగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ హీరోతో వారు సినిమా చేస్తుంటే.. ఆ హీరోకి అభిమానినని, లేదంటే ఆ హీరోలో అది ఇష్టమని, ఇది ఇష్టమని చెబుతుంటారు. ఈ విషయంలో రష్మిక మందన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. కన్నడ నుంచి వచ్చిన ఈ భామ.. టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ.. కన్నడ చిత్రాలను తక్కువగా చూసేది. అక్కడ హీరోతో సిల్లీ రీజన్‌తో పెళ్లి వదిలేసుకుని వచ్చి మరీ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయింది. 

టాలీవుడ్ హీరోయిన్‌గా మిషన్ సక్సెస్ అయిన తర్వాత.. బాలీవుడ్‌, కోలీవుడ్‌పై కన్నేసింది. కోలీవుడ్‌లో విజయ్ సరసన ఛాన్స్ రాగానే.. ఇక విజయ్‌ని ఆకాశానికి ఎత్తేసింది. తోపు, తురుము.. అంటూ విజయ్‌ పై ఎక్కడాలేని ప్రేమని కురిపించింది. ఇప్పుడు అజిత్ సరసన అవకాశం వచ్చిందంటే.. అతడిని కూడా అలాగే లేపేస్తుంది. అయితే కోలీవుడ్ మిషన్‌లో ఆమె ఓ 70 శాతం సక్సెస్ అయితే.. బాలీవుడ్ మిషన్‌‌ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా నడుస్తుంది. అక్కడామె పప్పులు మాత్రం ఉడకడం లేదు. 

ముఖ్యంగా బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత రష్మికలో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంక తనకి తిరుగులేదని, ఇక తన టార్గెట్ హాలీవుడ్ అనే రేంజ్‌లో మాట్లాడేస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ వింటూనే పెరిగానని.. సౌత్ సినిమాల మ్యూజిక్‌ని తక్కువ చేసిన ఈ భామకి.. అక్కడ మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అక్కడ ఆల్రెడీ ఆమె చేసిన ‘గుడ్ బై’ చిత్రం బై బై చెప్పేస్తే.. తాజాగా విడుదలైన ‘మిషన్ మజ్ను’ కూడా పక్కదారి పట్టేసింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని పట్టించుకునే నాధుడే లేడు. దీంతో ఆమె బాలీవుడ్ మిషన్ భారీగా ఫెయిలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘యానిమల్’ అనే ఒకే ఒక చిత్రం ఉంది.

Rashmika Mandanna Mission Failed in Bollywood:

Negative Talk to Rashmika Mandanna Mission Majnu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ