Advertisementt

‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌కి చిరు వాచ్ గిఫ్ట్!

Fri 03rd Mar 2023 07:53 AM
gopichand malineni,megastar chiranjeevi,watch gift,veera simha reddy,stalin,balakrishna  ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌కి చిరు వాచ్ గిఫ్ట్!
Megastar Chiranjeevi Gift To Veera Simha Reddy Director Gopichand Malineni ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌కి చిరు వాచ్ గిఫ్ట్!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ డైరెక్టర్‌కి మెగాస్టార్ చిరంజీవి వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారట. అయితే అది ఇప్పుడు కాదు. బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేనికి.. ఆయన కెరీర్ తొలినాళ్లలో మెగాస్టార్ చిరంజీవి వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇక నీ టైమ్ మొదలైంది అంటూ ఆశీర్వదించారట కూడా. ఈ విషయం స్వయంగా గోపీచంద్ మలినేని తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న సమయంలో.. ఇది జరిగిందని గోపీచంద్ చెప్పుకొచ్చారు. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా.. ఆ రోజు నా బర్త్‌డే వచ్చింది. ఆ సెట్స్‌కి మెగాస్టార్ చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు వచ్చారు. నా బర్త్‌డే అని తెలుసుకుని.. వెంటనే వాచ్‌ని తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ రోజు నుంచి నీ టైమ్ మొదలవుతుంది.. నీ టైమ్ మారిపోతుంది అంటూ చిరంజీవిగారు ఆశీర్వదించారు.. అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాకు గోపీచంద్ మలినేని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.

కాగా.. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్‌లో సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం మాస్ హిట్‌గా దూసుకెళుతోంది. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరలో ఉంది. కొన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇప్పటికే లాభాల బాటలో నడుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య NBK 108 చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేస్తున్నారు. ఇక గోపీచంద్ మలినేని తదుపరి చిత్రానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Megastar Chiranjeevi Gift To Veera Simha Reddy Director Gopichand Malineni:

Director Gopichand Malineni Talks about Megastar Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ