మెగా ఫ్యామిలీలోకి రామ్ చరణ్ భార్యగా, మెగాస్టార్ చిరుకి కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన.. ఉపాసన కొణిదెలాగా పూర్తిగా మెగా ఫ్యామిలీ బాధ్యతలు చేపట్టింది. అటు పుట్టింటి వ్యాపారాలను, ఇటు మెట్టినింటి గౌవర బాధ్యతలు మోస్తున్న ఉపాసన గత ఏడాది ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటినుండి అటు మెగా ఫ్యామిలీ, ఇటు ఉపాసన పుట్టింట్లో ఆనందం వెల్లువిరిసంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు చెప్పిన శుభవార్త రెండు ఇళ్ళలో సంతోషానికి కారణమయ్యింది. ప్రెగ్నెంట్ అని అత్తమామలకి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్న ఉపాసన.. తర్వాత పుట్టింటికి వెళ్లి అక్కడ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంది.
అయితే ఇంత సంతోషకరమైన సమయంలో ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాసన గ్రాండ్ మథర్ ఈ రోజు సోమవారం అనారోగ్య కారణాలతో కన్ను మూయడంతో ఉపాసన పుట్టిల్లు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఉపాసన తన గ్రాండ్ మథర్ పుష్నాని మరణంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. కడవరకు, కృతజ్ఞతా, ప్రేమ, గౌరవం, సానుభూతితో తన జీవితాన్ని కొనసాగించింది. పుష్నాని జీవితం నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను. నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె పంచిన ప్రేమను ఎప్పటికి మరువలేను, నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి నేర్చుకున్న విషయాలను, ప్రేమానుభూతులని అన్నిటిని నా పిల్లలకి కూడా పంచుతాను అని ప్రమాణం చేస్తున్నాను అంటూ తన గ్రాండ్ మదర్ తో తాను ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ గా ఉపాసన ఇలా రియాక్ట్ అయ్యింది.