Advertisementt

పుష్ప టీమ్ కి దర్శకుడి వార్నింగ్

Tue 24th Jan 2023 07:48 PM
sukumar,pushpa 2  పుష్ప టీమ్ కి దర్శకుడి వార్నింగ్
Director warning to Pushpa 2 team పుష్ప టీమ్ కి దర్శకుడి వార్నింగ్
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. వైజాగ్ షెడ్యూల్ లో ఈమధ్యనే బన్నీ జాయిన్ అయ్యాడు. అల్లు అర్జున్ వైజాగ్ లో దిగగానే అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ పుష్ప షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ ఎలా ఉంటాడో.. పుష్ప రాజ్ గా ఇంకేమన్నా కొత్త లుక్ లో, కొత్తగా కనిపిస్తాడేమో అనే క్యూరియాసిటిలో షూటింగ్ జరిగే చోటే కాపు కాచుకుని కూర్చుంటున్నారు. అయితే పుష్ప ద రైజ్ స్టార్ట్ అయిన కొత్తల్లోనే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఓ డైలాగ్ కూడా లీక్ చేసారు.

తాజాగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుండగా.. అనసూయని స్పెషల్ సాంగ్ లో చూపించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈలోపులో వైజాగ్ షూటింగ్ స్పాట్ నుండి పుష్ప రాజ్ లుక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చాడట. మొదటి నుంచి పుష్ప 2కి లీక్ ల బెడద అంటుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప నుండి ఎలాంటి విషయం కానీ, పిక్స్ కానీ లీకవ్వకూడదు.. లీకైతే పర్యవసానాలు వేరేగా ఉంటాయని ఆయన తన టీమ్ కి స్ట్రాంగ్ గా వారింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Director warning to Pushpa 2 team:

Sukumar strong warning to Pushpa 2 team

Tags:   SUKUMAR, PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ