అక్కినేని వర్ధంతి రోజున నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావుని కించపరుస్తూ మాట్లాడిన మాటలతో అక్కినేని ఫాన్స్ బాలకృష్ణ పై గుర్రున ఉన్నారు. బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. లెజెండరీ యాక్టర్, నందమూరి రామారావు తో పాటు పేరున్న గొప్ప వ్యక్తిని ఆలా కించపరచడం అక్కినేని అభిమానులకి నచ్చలేదు. ఈ విషయంలో నాగార్జున కూడా స్పందిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ నాగార్జున సైలెంట్ గా ఉండి.. అఖిల్, నాగ చైతన్య లతో ఓ ప్రెస్ నోట్ విడుదల చేయించారు. అది కూడా బాలకృష్ణ పేరు ఎత్తకుండా సున్నితంగా బాలయ్యకి తగిలేలా చాలా డీసెంట్ గా మట్లాడారు.
అయితే గతంలో నాగార్జున బంగార్రాజు విజయోత్సవంలో ఇండస్ట్రీకి నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగశేశ్వరరావు గారు రెండు కళ్ళు, మనం ఉన్నంతకాలం వారిని గుర్తు చేసుకోవాలి, ఎన్టీఆర్ లివ్స్ ఆన్, ANR లివ్స్ ఆన్ అంటూ అది కూడా ఎన్టీఆర్ వర్ధంతి రోజున మాట్లాడగా.. బాలకృష్ణ మాత్రం ANR వర్ధంతి రోజున ఇలాంటి కించపరిచే మాటలతో అక్కినేని అవమానించడం ఎంతవరకు సబబు అంటూ అప్పట్లో నాగార్జున ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వీడియోస్ ని అక్కినేని ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.