Advertisementt

ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా..

Wed 25th Jan 2023 11:55 AM
jr ntr,koratala siva,ntr30  ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా..
NTR 30 new update ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా..
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఫాన్స్ నిన్నటివరకు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా యంగ్ టైగర్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళతాడా అని ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నుండి అభిమానులు అల్లకల్లోలంగా ఉన్నారు. ఏడాది సమయం వేస్ట్ అయ్యిపోయింది అంటూ దిగులుపడిపోయారు. కానీ ఇప్పుడు NTR30 ముహూర్తానికి సమయం దగ్గరపడే కొద్దీ వారు చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ లోకి అడుగుపెడితేనే కానీ వారు కూల్ అయ్యేలా లేరు. 

మరోపక్క అల్లు అర్జున్, మహేష్ ఇలా ఎవరికి వారే షూటింగ్స్ లో హడావిడిగా ఉంటే ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. ప్రస్తుతం NTR30 మేకోవర్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడని అంటున్నా.. ఆయన జిమ్ పిక్ అయినా వదలకపోతారా.. అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. ఈ నెల చివరి వారం అంటే ఈ వారంలోనే ఎన్టీఆర్ పై NTR30 కోసం ఫోటో షూట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. NTR30లో ఎన్టీఆర్ మాస్ అవతార్ లోనే కనిపిస్తారని ఫస్ట్ వీడియో అండ్ ప్రీ లుక్ పోస్టర్ తోనే కన్ ఫర్మ్ చేసారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా అంటూ అభిమానులు ఆలోచనలో ఉన్నారు. ఇక NTR30 కోసం జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చెయ్యబోతున్నారని టాక్ నడుస్తుంది. వచ్చే నెలలోనే పూజా కార్యక్రమాలతో మొదలు కాబోయే NTR30 అదే రోజు నుండి షూట్ మొదలు పెట్టుకోనున్నట్టు సమాచారం.

NTR 30 new update :

Jr NTR-Koratala Siva NTR30 Shooting From February 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ