దుల్హనియాలు కోరుకునే దిల్ వాలే షారుఖ్ నేడు పఠాన్ గా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. వరుస పరాజయాలతో డీలా పడ్డ బాలీవుడ్ బాద్ షా తన బ్యాడ్ పీరియడ్ తో పాటు కోవిడ్ పీరియడ్ నీ సాకుగా చూపిస్తూ నాలుగేళ్ల గ్యాప్ తీసేసుకున్నాడు. ఫైనల్ గా నేడు పఠాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాల బాట పక్కనెట్టి.. సక్సెస్ సూత్రం చంకనెట్టి స్క్రీన్స్ పై ప్రత్యక్షమైన పఠాన్ కి దేశ వ్యాప్తిముగా మంచి రెసెప్షన్ లభించింది. ఆల్ ఓవర్ ఇండియా అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టుకున్న పఠాన్ చిత్రం షారుఖ్ స్టార్ డమ్ ని మరో మారు ప్రూవ్ చేసింది.
కథగా పఠాన్ అందరికీ తెలిసిందే అయినా పఠాన్ పాత్రలో షారుఖ్ తన బెస్ట్ ఇచ్చేసాడు. దీపికా అయితే ఇండియన్ స్క్రీన్ ఇక్కడితో ఆగమంది నన్ను అని చాటి చెప్పేలా వీలున్నంత విడమరిచేసింది. జాన్ అబ్రహాం స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి సెగలు పుట్టించాడు. డింపుల్ కపాడియా క్యారెక్టర్ కాస్త ఎమోషన్ యాడ్ చేస్తే అశుతోష్ రానా రోల్ సపోర్ట్ గా నిలిచింది.
అయితే పఠాన్ సినిమాకి సాలిడ్ స్ట్రెంగ్త్ మాత్రం సల్మాన్ ఖానే. మొన్నామధ్య మన తెలుగు సినిమా గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చిరంజీవికి అండగా నిలబడ్డ సల్మాన్ ఈ సినిమాలో చిక్కుల్లో పడ్డ పఠాన్ కి సహాయం చేసే టైగర్ గా అదరగొట్టాడు. అదేదో క్యామియో , గెస్ట్ రోల్ అని ఈజీ గా చెప్పలేనంత ఇంపాక్ట్ చూపించాడు.
మొత్తానికి కథ, కథనాలు అంతంతమాత్రంగానే ఉన్నా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చేసినట్టు.. బాలీవుడ్ బాదుషా షారుఖ్ కమ్ బ్యాక్ ఫిలిం అనే టాక్ తెచ్చేసుకుంది పఠాన్. చూద్దాం.. ఇండియన్ బాక్సఫీస్ వద్ద ఈ పఠాన్ పతంగ్ ఎంతవరకు ఎగురుతుందో.. ఎన్ని కోట్లు రాబడుతుందో..!