లెజెండరీ యాక్టర్ అక్కినేనిపై నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలతో ఇప్పుడు బాలకృష్ణ ఇరకాటంలో పడ్డారు. అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ అక్కినేని వర్ధంతి రోజున చేసిన వ్యాఖ్యలతో అక్కినేని అనుభినులు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో బాలకృష్ణపై అక్కినేని అభిమానులు ఫైర్ అవ్వడమే కాదు.. బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చెయ్యడమే కాదు.. ఇప్పుడు బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ధర్నాకి దిగుతున్నారు.
ఈరోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్ దగ్గర అక్కినేని అభిమానులు ధర్నా చెయ్యడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు దారుణమంటూ, నీ తండ్రి లాంటి వారు, ఎంతోమంది అభిమానానికి అర్హులైన అక్కినేనిని బాలకృష్ణ అలా దిగజార్జి మాట్లాడడం సహించేది లేదు అంటూ అక్కినేని అభిమానులు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అక్కినేని ఫాన్స్ మెంటల్ బాలకృష్ణ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ వివాదం ముగియాలంటే బాలకృష్ణ బయటికి వచ్చి క్షమాపణ చెబితే సరిపోతుంది. లేదంటే ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో తెలియడం లేదు.