Advertisementt

చుక్కల చీరలో శ్రద్దగా చూపించింది

Thu 26th Jan 2023 08:50 PM
shraddha das saree pic  చుక్కల చీరలో శ్రద్దగా చూపించింది
Shraddha Das Saree pics viral చుక్కల చీరలో శ్రద్దగా చూపించింది
Advertisement
Ads by CJ

ఎప్పుడూ గ్లామర్ డాల్ గానే ఎక్స్పోజ్ అయ్యి.. అవకాశాలు అందిపుచ్చుకున్న ఒకప్పటి నటి శ్రద్ద దాస్ ఇప్పుడు సినిమాల్లో చాలా అరుదుగా కాదు.. అస్సలు కనిపించడం లేదు. కానీ బుల్లితెర మీద మాత్రం శ్రద్దగా వయ్యారాలు ఒలకబోస్తూ గ్లామర్ తో అందరిని పడేస్తుంది. ఒకప్పుడు అనసూయ అందాలు చూసేందుకు సోషల్ మీడియాలో గురువారం కాచుకుని కూర్చుకునే యూత్ ఇప్పుడు బుధవారం కోసం వెయిట్ చేస్తున్నారు. కారణం శ్రద్ద దాస్ పిక్స్ కోసం అన్నమాట.

బుధవారం ఢీ డాన్స్ షో కి కలర్ ఫుల్ జెడ్జ్ గా హాజరవుతున్న శ్రద్దా దాస్ ఆ షో మొదలయ్యే ముందు తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ బుధవారం కూడా శ్రద్ద దాస్ చుక్కలు శారీలో మెరిసింది. వైట్ సారీ లో బొడ్డు కిందవరకూ కట్టిన చీర కుచ్చిళ్లని పక్కకి జరిపి మరీ హొయలు పోయింది. బ్లాక్ బ్లౌజ్ లో వైట్ సారీ లో లూజ్ హెయిర్ తో శ్రద్ద దాస్ అందాలు మరింత అందంగా కనిపించాయి. మరి మీరు శ్రద్ద దాస్ చుక్కల చీర పిక్ ని ఓ లుక్కెయ్యండి.

Shraddha Das Saree pics viral:

Shraddha Das white saree pics goes viral