జబర్దస్త్ లో శుక్రవారం టీమ్ లీడర్ గా కామెడీ స్కిట్స్ తో ఆకట్టుకునే రాకింగ్ రాకేష్ ఫైనల్లీ తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. బిగ్ బాస్ తో ఫెమస్ అయ్యి తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ స్కిట్ లో వన్ అఫ్ ద కమెడియన్ గా చేరడమే కాదు, వారి మధ్యన ప్రేమ కూడా చిగురించి జబర్దస్త్ స్టేజ్ పైనే ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ లోను సుజాత తో రాజేష్ నిశ్చితార్ధపు ఉంగరాలు మార్చుకున్నాడు.
రాకేష్ తో ప్రేమలో ఉన్న సుజాత పెళ్లి అనుకోకముందు నుండే రాకేష్ ఇంటికి తరచూ వెళుతూ ఫెస్టివల్స్ అప్పుడు రాకేష్ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేది. అప్పుడే వీరు పెళ్లి చేసుకుంటున్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఇక పెద్దల అంగీకారంతో ఈరోజు జనవరి 27 న రాకేష్-సుజాత నిశ్చితార్థంలో ఉంగరాలతో పాటుగా దండలూ మార్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా రాకేష్-సుజాతలు తెలియజేసారు. త్వరలోనే పెళ్ళికి ముహూర్థం పెట్టించి ఆ తేదీని తెలియజేస్తామని చెప్పారు.
రాకేష్-సుజాతల ఎంగేజ్మెంట్ కి ఇరు కుటుంబ సభ్యులు అలాగే రాకేష్ స్నేహితులు, జబర్దస్త్ కమేడియన్స్, యాంకర్ రవి ఇలా కొద్దిమంది పాల్గొన్నారు. మిగతా జబర్దస్త్ కమేడియన్స్ రాకేష్ కి సుజాతకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.