NTR30 మొదలు కావడానికి సమయం దగ్గరపడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా మొదలు కాబోతున్న ఈ మూవీపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. గత మూడు నెలలుగా NTR30 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. కొరటాల అటు అనిరుద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్, ఇటు సెట్స్ విషయంలోనూ, అలాగే కీలకపాత్ర ఎంపికలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్టీఆర్ కి ఆర్.ఆర్.ఆర్ కి మించి హిట్ ఇవ్వాలనే కసితో కొరటాల ఉన్నారు. అలాగే తనపై ఉన్న ఆచార్య రిమార్క్ ని చెరిపెయ్యాలని చూస్తున్నారు.
అదలాఉంటే NTR30 కోసం భారీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దాని కోసం హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. ఈ సెట్‌లో NTR30 కి సంబందించిన ఒక యాక్షన్ సీన్‌తో పాటు టాకీ పార్టు షెడ్యూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ నిర్మాణం లో బిజీగా వున్న ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ రీసెంట్ గా NTR30 సెట్ లోనే జరిగాయి. ఈ సెట్ నిర్మాణం కోసం చాలామంది వర్క్ చేస్తున్న విషయం ఆ పిక్స్ ద్వారానే తెలిసింది.
ఇక NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసమయానికి హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరిలో మొదలు కాబోతున్న NTR30 వచ్చే ఏడాది ఏప్రిల్ లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది.