ఏం మట్లాడినా.. అందులో అర్ధాలు, పెడర్ధాలు, పరమార్ధాలు వెతికేసి మరీ నెగిటివిటి చూపిస్తూ ట్రోల్స్ చేసే స్థాయికి సోషల్ మీడియా దిగజారిపోయింది. సెలబ్రిటీస్ ఫ్లోలో అన్నమాటలను పట్టుకుని రాద్ధాంతం చెయ్యడమే కాదు, నా సొంత అనుకున్న వారిపై ప్రేమ చూపించినా తప్పే అన్నట్టుగా ఉంది ప్రస్తుత మీడియా వ్యవహారం. రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా వీరయ్య విజయ విహారం అంటూ ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. మరి ఈ ఈవెంట్ లో మెగాస్టార్ సరదాగా అన్నమాటలను పట్టుకుని ఇప్పుడు దానిపై ట్రోల్స్, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ మెగాస్టార్ వ్యక్తిత్వాన్ని, మెగాస్టార్ మాట తూలారంటూ ఎత్తిపొడుపు మాటలని, మెగాస్టార్ అంతటివాడు అలా మాట్లాడొచ్చా అంటూ రకరకాల ప్రశ్నలతో మెగాస్టార్ ని వేలెత్తి చూపిస్తున్నారు.
అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా తయారయ్యారు. ఒకసారి మెగాస్టర్ సినిమాలు మానేస్తే బెటర్ అన్నవాళ్ళే.. మెగాస్టార్ కాబట్టే ఈ రేంజ్ వసూళ్లు, ఆయన స్టామినా చూసారా అంటూ పొగుడుతారు. నరం లేని నాలుక నాలుగు విధాలుగా మాట్లాడడం అంటే ఇదే అన్నట్టుగా ఉంది తంతు. వీరయ్య విజయ విహారంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఒక చిన్న హీరో కి లుంగీ తో తుడిచి ముద్దుపెట్టడం పెద్ద హీరోగా మీరు మాత్రమే చేసారని దర్శకుడు బాబీ అన్నాడు అంటూ మెగాస్టార్ చేసిన కామెంట్స్ తో రవితేజ ను ఒక చిన్న హీరో అని మెగాస్టార్ అనడం పై అసంతృప్తి గా ఉన్న రవితేజ అభిమానులు, మెగాస్టార్ అయ్యుండి రవితేజని చిన్న హీరో అనడం కరెక్టా అని లా పాయింట్స్ తీస్తున్నారు. మెగాస్టార్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో అర్ధం కానీ చవటలు ఇలాంటి పెడర్ధాలు వెతుకుతారు. మెగాస్టార్ డెఫ్ నెట్ గా పెద్ద హీరో, ఆయన కన్నా రవితేజ డెఫ్ నెట్ గా చిన్న హీరోనే. అంటే ఆయన కన్నా వయసులో చిన్నా, స్టార్ డమ్ లో చిన్న. కాబట్టే ఆయన అలా అన్నారు. అంతేకాని, వసూళ్ల పరంగా, సినిమాల పరంగా చిన్న హీరో అంటూ అవమానించలేదు, సాగదియ్యలేదు అనేది మెగా అభిమానుల వాదన. మరి మెగాస్టార్ రవితేజ కలిసి నటిస్తుంటే నా తమ్ముడు పవన్ తో కలిసి నటించినట్టే ఉంది అన్నారు. దాన్ని హైలెట్ చెయ్యరే..
మెగాస్టార్ రవితేజ చిన్న హీరో అనడంతో ఇకపై ఆయనతో నటించేందుకు ఏ హీరో ముందుకు రారని అంటున్నారు. మెగాస్టార్ తో అవకాశం రావాలే కానీ.. ఏ హీరో కూడా ఆ ఆఫర్ వదులకోరు. సల్మాన్ లాంటి స్టార్ హీరోనే మెగాస్టార్ సినిమాలో గెస్ట్ గా చేసారు. ఆయన అవకాశం ఇవ్వలేకాని.. చిన్న, పెద్ద హీరోలు లైన్ లో ఉంటారు ఆయనతో నటించేందుకు.. ఇది తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది.