Advertisementt

తమన్నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

Sun 29th Jan 2023 07:06 PM
tamannaah,vijay varma  తమన్నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?
Tamannaah engagement date fixed? తమన్నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?
Advertisement
Ads by CJ

ఫైనల్లీ మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యింది అనే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నాని MCA సినిమాలో విలన్ గా నటించిన హైదరాబాద్ వాసి, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్నా డేటింగ్ లో ఉంది అనే న్యూస్ ని ఆమె కాదన్నా కూడా.. న్యూ ఇయర్ రోజున మాత్రం ఇండైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేసింది. గోవాలో కలిసి పార్టీ చేసుకోవడమే కాదు, కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, తరవాత బుక్ లాంచ్ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి స్టేజ్ పై దర్శనమివ్వడంతో వీరి మధ్యన లవ్ ట్రాక్ ఉంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తమన్నా విజయ్ వర్మతో ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యింది అంటున్నారు.

ఇప్పటికే తమన్నా- విజయ్ వర్మల నిశ్చితార్ధం డేట్ ఫిక్స్ అయ్యింది.. ఈ విషయాలను తమన్నా సీక్రెట్ గా ఉంచేందుకు ట్రై చేస్తుందట. తమన్నా ఫామిలీ,  విజయ్ వర్మ ఫామిలీస్ వీరి పెళ్ళికి ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున తమన్నా- విజయ్ వర్మల నిశ్చితార్ధానికి డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. పెళ్లి తేదీ కూడా నిశ్చయమైపోయింది అంటూ మరో న్యూస్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఏప్రిల్ 21న తమన్నా పెళ్లి విజయ్ వర్మతో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మిల్కి బ్యూటీ ఈ పెళ్లి, నిశ్సితార్ధం న్యూస్ లపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Tamannaah engagement date fixed?:

Tamannaah Going To Marry Vijay Varma And Marriage ,Engagement Dates Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ